పుష్ప-2ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై సిద్ధార్థ్ క్లారిటీ..! 10 d ago
పుష్ప 2 ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పై హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్ నటించిన "మిస్ యూ" ప్రమోషన్స్ లో మాట్లాడుతూ "తనకు అల్లు అర్జున్ తో కానీ, ఇతర నటీనటులతో కానీ ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. పుష్ప 2 మంచి విజయం సాదించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఇలానే కళకళలాడుతూ ఉండాలని చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.